రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

ABN , First Publish Date - 2021-11-01T05:23:57+05:30 IST

మరడాం జంక్షన్‌ వద్ద రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒకరు గాయపడ్డారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

దత్తిరాజేరు: మరడాం జంక్షన్‌ వద్ద రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒకరు గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం చోటుచేసు కుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కె.కృష్ణాపురం గ్రామానికి చెందిన పి.సూర్యారావు అనే వ్యక్తి బైకుపై తన స్వగ్రామం నుంచి మానా పురం వైపు వెళ్తున్నారు. అదే సమ యంలో వెనుక నుంచి మరో బైకుపై వస్తున్న రామభద్రపురానికి చెందిన ప్రకాష్‌ ఢీకొట్టారు. దీంతో సూర్యారావు పక్కకు బోల్తాపడ్డాడు. అదే సమయంలో ఎదురు గా ఆర్టీసీ బస్సు రావడంతో బైకు బస్సు కిందకు వెళ్లిపోయింది. దీంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు.

 

Updated Date - 2021-11-01T05:23:57+05:30 IST