బస్సులోంచి దూకిన వ్యక్తికి గాయాలు

ABN , First Publish Date - 2021-10-19T05:31:54+05:30 IST

అరకు నుంచి విశాఖపట్టణం వెళ్తున్న ఆర్టీసీ బస్సు లో నుంచి గుర్తుతెలియని వ్యక్తి దూకి తీవ్ర గాయాలపాలయ్యారు.

బస్సులోంచి దూకిన వ్యక్తికి గాయాలు
క్షతగాత్రుడిని 108 వాహనంలో తరలిస్తున్న దృశ్యం

లక్కవరపుకోట, అక్టోబరు 18: అరకు నుంచి విశాఖపట్టణం వెళ్తున్న ఆర్టీసీ బస్సు లో నుంచి గుర్తుతెలియని వ్యక్తి దూకి తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన స్థానిక బస్టాపునకు సుమారు 200 మీటర్ల దూరం లో సోమవారం చోటుచేసుకుంది. తోటి ప్రయాణికులు చెప్పిన వివరాల ప్రకారం.. బాధితుడు అరకు నుంచి కొత్తవలసకు టికెటు తీసుకున్నారు. బస్సు లక్కవరపుకోట వద్దకు వచ్చేసరికి బొద్దాం జంక్షన్‌ దాటామా లేదా అని కండక్టర్‌ను అడిగారు. బొద్దాం సెంటరు దాటిపోయిందని ఎదురుగా ఉన్న బస్టాపులో ఆపుతామని అక్కడ దిగి బొద్దాం వెళ్లొచ్చని కండక్టర్‌ చెప్పారు. కానీ ఆ వ్యక్తి బస్టాపు రాకముందే బస్సులోంచి దూకేశాడు. వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించారు. బాధితుడిని ఎస్‌.కోట పీహెచ్‌సీకి తీసుకువెళ్లగా అక్కడి వైద్యులు విజయనగరం రిఫర్‌ చేశారు.  దీనిపై పోలీసులను వివరణ కోరగా తమకు ఎటువంటి సమాచారం అందలేదన్నారు. 

Updated Date - 2021-10-19T05:31:54+05:30 IST