లైసెన్స ఉంటేనే!

ABN , First Publish Date - 2021-12-27T05:12:50+05:30 IST

పశువులు, కోళ్ల దాణా ఇష్టారాజ్యంగా విక్రయిస్తామంటే ఇక కుదరదు. లైసెన్స ఉన్న వారే విక్రయించాలి. లేకుంటే పశుసంవర్థక శాఖ అధికారులు తీసుకునే చర్యలకు బాధ్యులవుతారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సమగ్ర ఫీడ్‌ 2021 చట్టం కింద ఆదేశాలిచ్చింది.

లైసెన్స ఉంటేనే!
దాణా విక్రయదారులకు నోటీసులిస్తున్న పశుసంవర్థక శాఖ అధికారులు

పశువులు, కోళ్ల దాణా విక్రయాలు

ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

ఉత్పత్తిదారులకు, వ్యాపారులకు నోటీసులు

31లోగా ఫీజు చెల్లించాలని ఆదేశాలు

(కలెక్టరేట్‌)

పశువులు, కోళ్ల దాణా ఇష్టారాజ్యంగా విక్రయిస్తామంటే ఇక కుదరదు. లైసెన్స ఉన్న వారే విక్రయించాలి. లేకుంటే పశుసంవర్థక శాఖ అధికారులు తీసుకునే చర్యలకు బాధ్యులవుతారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సమగ్ర ఫీడ్‌  2021 చట్టం కింద ఆదేశాలిచ్చింది. దాణా ఉత్పత్తి చేస్తున్న వారు, విక్రయించిన వారు ఈ నెల 31లోగా లైసెన్స తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అధికారులు దాణా ఉత్పత్తిదారులు, విక్రయదారులకు అవగాహన కల్పిస్తున్నారు. నోటీసులు జారీ చేస్తున్నారు. షాపులను కేటగిరీ వారీగా విభజించారు. ఫీజులను  నిర్ధారించారు. ఏడాదికి లక్ష మెట్రిక్‌ టన్నులు దాణా విక్రయించే షాపులకు రూ.2 లక్షలు. 50 వేల నుంచి 99 వేల మెట్రిక్‌ టన్నుల దాణా విక్రయిస్తే రూ.75 వేలు, 25 వేల నుంచి 50 వేల మెట్రిక్‌ టన్నుల దాణా విక్రయిస్తే రూ.50 వేలు, 25 వేలు మెట్రిక్‌ టన్నులలోపు విక్రయిస్తే ఫీజు కింద రూ.25 వేలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. రైతుభరోసా కేంద్రాల్లో లైసెన్స కోసం దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజును చలానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. దీనికి పశుసంవర్థక శాఖ సహాయ సంచాలకులు ఫీడ్‌ ఇనస్పెక్టర్లుగా వ్యవహరిస్తారు. పశుసంవర్థక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ లైసెన్స మంజూరు చేస్తారు. తాజా నిర్ణయంతో నాణ్యత గల దాణా విక్రయించే అవకాశముంటుందని అధికారులు చెబుతున్నారు. వ్యాపారులు మాత్రం అంత లైసెన్స ఫీజు చెల్లించలేమని పెదవి విరుస్తున్నారు. దీనిపై పశుసంవర్థక శాఖ ఏడీ రెడ్డి కృష్ణ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా...ఈ నెల 31లోగా విధిగా లైసెన్సలు పొంది ఉండాలన్నారు. కేవలం లైసెన్స ఉన్నవారు మాత్రమే దాణా విక్రయించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.



Updated Date - 2021-12-27T05:12:50+05:30 IST