కొండలు ఎక్కితేనే..

ABN , First Publish Date - 2021-05-19T05:03:47+05:30 IST

ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందించడానికి వలంటీర్లు ఎదుర్కొంటున్న పాట్లు వర్ణనాతీతం. ఇంటర్నెట్‌ సిగ్నల్స్‌ అందుబాటులో లేక.. సెల్‌ఫోన్లలో నెట్‌ సౌకర్యం ఉన్నా పనిచేయక నరకయాతన పడుతున్నారు. కురుపాం నియోజకవర్గంలో కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ మండలాల్లో సింహభాగం ఏజెన్సీ పంచాయతీలే.

కొండలు ఎక్కితేనే..
టీకే జమ్ము ఘాట్‌ వద్ద సెల్‌ఫోన్లతో సిగ్నల్స్‌ కోసం పడిగాపులు పడుతున్న వలంటీర్లు(ఫైల్‌)

వలంటీర్లకు అవస్థలు

పథకాల కోసం పడిగాపులు

జియ్యమ్మవలస, మే 18 : ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందించడానికి వలంటీర్లు ఎదుర్కొంటున్న పాట్లు వర్ణనాతీతం. ఇంటర్నెట్‌ సిగ్నల్స్‌ అందుబాటులో లేక.. సెల్‌ఫోన్లలో నెట్‌ సౌకర్యం ఉన్నా పనిచేయక నరకయాతన పడుతున్నారు. కురుపాం నియోజకవర్గంలో కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ మండలాల్లో సింహభాగం ఏజెన్సీ పంచాయతీలే. జియ్యమ్మవలస మండలంలో మాత్రం టీకే జమ్ము, పీటీ మండ, కొండ చిలకాం, అలమండ, అర్నాడ పంచాయతీలు మాత్రమే ఏజెన్సీలో ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు సిగ్నల్స్‌ అందని గ్రామాలు అనేకం. ముఖ్యంగా జియ్యమ్మవలస మండలంలో అయితే టీకే జమ్ము, పీటీ మండ, కొండ చిలకాం పంచాయతీల్లో 20 గ్రామాలకు సిగ్నల్స్‌ అస్సలు ఉండవు. చేసేదిలేక వలంటీర్లు సిగ్నల్స్‌ ఉన్న చోటుకు వెళ్లి గంటల తరబడి పడిగాపులు కాస్తుంటారు. కొండపై ఎత్తు ప్రదేశానికి వెళ్లి నిరీక్షిస్తున్నారు. అప్పటికీ కాకపోతే నిరాశతో వెనుదిరుగుతున్నారు. 


Updated Date - 2021-05-19T05:03:47+05:30 IST