అర్జీలు తిరష్కరిస్తే కారణం చెప్పాల్సిందే...

ABN , First Publish Date - 2021-08-11T04:53:55+05:30 IST

అర్జీలు తిరష్కరిస్తే కారణం చెప్పాల్సిందే...

అర్జీలు తిరష్కరిస్తే కారణం చెప్పాల్సిందే...
సమీక్షలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య

బొండపల్లి : భూ సమస్యల పరిష్కారానికి బాధితులు ఆన్‌లైన్‌లో చేసుకున్న అర్జీలను తిరష్కరిస్తే కారణం తప్పనిసరిగా వివరించాలని గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య అధికారులకు సూచించారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ భవనంలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌మిశ్రా ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బందితో సమీక్షించా రు. భూ సమస్యలపై రైతులు పలుమార్లు దరఖాస్తు చేసుకుంటున్నా... కారణం చెప్పకుండా తిరష్కరిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని... ఇది మంచి పద్ధతి కాదన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది పరిశీలించి సమస్య ఉంటే అర్జీదారులకు వివరించాన్నారు. రోళ్లవాక రెవెన్యూ పరిధిలో ఒక్కసారి 370 దరఖాస్తులు తిరష్కరణకు గురయ్యాయని, గ్రామంలో దండోరా వేయించి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.  రెవెన్యూ రికార్డులు సక్రమంగా లేని గ్రామాల్లో సర్వే చేపట్టి సరిచేయాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ రౌతు శంకరరావు, బొండపల్లి పీఏసీఎస్‌ అధ్యక్షుడు బుద్దరాజు ప్రభూజీ, సర్వేయర్‌ చప్ప గణపతిరావు, సచివాలయ సర్వేయర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-08-11T04:53:55+05:30 IST