అభ్యంతరాలొస్తే ప్లాన్‌ మారొచ్చు

ABN , First Publish Date - 2021-08-11T04:56:08+05:30 IST

అభ్యంతరాలొస్తే ప్లాన్‌ మారొచ్చు

అభ్యంతరాలొస్తే ప్లాన్‌ మారొచ్చు
మ్యాప్‌ను పరిశీలిస్తున్న అధికారులు

- వీఎంఆర్‌డీఏ ఏపీవో శోభన్‌బాబు
భోగాపురం, ఆగస్టు 10 :
వీఎంఆర్‌డీఏ- 2041 రహదారుల ఏర్పాటుపై రైతుల నుంచి అధికంగా అభ్యంతరాలు వస్తే ఆయా రోడ్లను ప్లానింగ్‌ నుంచి తొలగించే అవకాశం ఉందని వీఎంఆర్‌డీఏ అసిస్టెంట్‌ ప్లానింగ్‌ అధికారి వి.శోభన్‌బాబు చెప్పారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయానికి మంగళవారం వచ్చిన  ఆయన విలేకర్లతో మాట్లాడారు. వీఎంఆర్‌డీఏ-2041కు సంబంధించి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రహదారుల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించామన్నారు. భూములు పోతున్నాయంటూ చాలామంది రైతులు వినతులు అందజేస్తున్నారని, భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ, నెల్లి మర్ల, చీపురుపల్లి, గుర్ల, గరివిడి మండలాల నుంచి 1653 వినతులు వచ్చాయని, వీటన్నింటినీ 21 రోజల్లోగా పరిశీ లించి నివేదికను ఉన్న తాధికారులకు పంపి స్తామన్నారు. అనంతరం టెక్నికల్‌ బృందం పరిశీలించి తుది నిర్ణయం తీసు కుంటుందని చెప్పారు. ప్రస్తుతం వీఎం ఆర్‌డీఏ ప్లానింగ్‌ ప్రకారం సంబంధిత స్థలంలో మిస్సింగ్‌ సర్వే నంబర్లు, గోర్జు, రాస్తా, బండిదారి, చెరువులు, శ్మశాన వాటికలు వంటివి గుర్తించి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు. అన్ని నివేదికలు పరిశీలించిన తరువా త 2041కు సంబంధించి ప్లానింగ్‌ తయారవుతుందని, అవసరం మేరకు రహదా ర్లు నిర్మిస్తారన్నారు. అంతకముందు తహసీల్దార్‌ జి.కల్ప వల్లి, హెచ్‌డీటీ డి.గాంధీ, సర్వేయర్‌ శివాజీతో మ్యాప్‌ ఆధారంగా రహదారులపై చర్చించారు. కార్యక్రమంలో ఏడీఎం ఏఎస్‌ఎన్‌ రాజు, ఏడీఎం రాజేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-11T04:56:08+05:30 IST