భార్య మందలించిందని భర్త ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-08-11T04:57:23+05:30 IST

భార్య మందలించిందని భర్త ఆత్మహత్య

భార్య మందలించిందని భర్త ఆత్మహత్య

గంట్యాడ : భార్య మందలించిందని మనస్తాపానికి గురైన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నరవ గ్రామంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ నాయుడు మంగళ వారం వెల్లడించారు. గ్రామానికి చెందిన కొల్లి ఎర్రిబాబు (39) మద్యానికి బానిస య్యాడు. దీంతో సోమవారం రాత్రి మద్యం తాగివచ్చిన ఎర్రిబాబును అతడి భార్య సునీత నిలదీసింది. భోజనం చేసిన తర్వాత నిద్రించేందుకు ఇంటిలోనే వేరే గదిలోకి ఎర్రిబాబు వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం టీ తాగడానికి అతని భార్య పిలిచింది. ఎంతకీ తలుపు తీయకపోవడంతో అను మానం వచ్చి కిటికిలో నుంచి చూసే సరికి ఇంటి ఊచలకు చీరతో ఉరివేసుకుని ఎర్రిబాబు మృతదేహం వేలాడుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిం చారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేశారు. కాగా ఎర్రిబాబుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 

Updated Date - 2021-08-11T04:57:23+05:30 IST