హాస్టల్‌ సరుకులు అంగట్లో..

ABN , First Publish Date - 2021-02-06T05:07:01+05:30 IST

హాస్టల్‌ సరుకులు అక్రమ మార్గాన కొనుగోలు చేస్తూ అంగట్లో అమ్మకానికి పెట్టిన గుమ్మలక్ష్మీపురం మాజీ సర్పంచ్‌ ఎద్దు మురళీ నిల్వ ఉంచిన స్టాక్‌ వివరాలను అధికారులు శుక్రవా రం లెక్కించారు.

హాస్టల్‌ సరుకులు అంగట్లో..

 చర్యలు లేవంటున్న ఫిర్యాదుదారులు

గుమ్మలక్ష్మీపురం, ఫిబ్రవ రి 5: హాస్టల్‌ సరుకులు అక్రమ మార్గాన కొనుగోలు చేస్తూ అంగట్లో అమ్మకానికి పెట్టిన గుమ్మలక్ష్మీపురం మాజీ సర్పంచ్‌ ఎద్దు మురళీ నిల్వ ఉంచిన స్టాక్‌ వివరాలను అధికారులు శుక్రవా రం లెక్కించారు. గుమ్మలక్ష్మీపు రం తహసీల్దార్‌ రాములమ్మ ఆధ్వర్యంలో ఏటీడబ్ల్యూవో కృష్ణవేణి, ఎల్విన్‌పేట ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్‌, ఆర్‌ఐ సూర్యారావు, వీఆర్‌వో బోడెమ్మ ఈ లెక్కింపులో పాల్గొన్నారు. ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు పంపిణీ చేసిన బట్టల క్లాత్‌, రిబ్బన్లు, సబ్బులు, ఇతర సామగ్రిని వసతి గృహాల నుంచి కొనుగోలు చేసి బయట వ్యాపారులకు అమ్ముతున్నారన్న ఆరోపణతో గిరిజన జేఏసీ నాయకులు సమాచార హక్కు చట్టం కింద ఫిర్యాదు చేశారు.  దీంతో అధికారులు స్పందించి దీనిపై దాడి చేసి వస్తువులను సీజ్‌ చేశారు. హాస్టల్‌ విద్యార్థులకు పంపిణీ చేసిన లక్షలాది రూపాయల విలువైన సామగ్రిని కొనుగోలు చేసిన వ్యక్తిపై నేటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపో వడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దమని స్థానికులు వాపోతున్నారు. 

 


Updated Date - 2021-02-06T05:07:01+05:30 IST