సీపీఎస్‌ రద్దుకు పాదయాత్ర

ABN , First Publish Date - 2021-08-11T04:54:04+05:30 IST

సీపీఎస్‌ రద్దుకు యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడతామని జిల్లా గౌర వాధ్యక్షుడు ఎ.సత్యశ్రీనివాస్‌ తెలిపారు. ఈనెల 12 నుంచి అన్ని మండల కేంద్రాల్లో పర్యటి స్తామన్నారు.

సీపీఎస్‌ రద్దుకు పాదయాత్ర
మాట్లాడుతున్న జిల్లా నాయకులు

మెరకముడిదాం:  సీపీఎస్‌ రద్దుకు యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడతామని జిల్లా గౌర వాధ్యక్షుడు ఎ.సత్యశ్రీనివాస్‌ తెలిపారు. ఈనెల 12 నుంచి అన్ని మండల కేంద్రాల్లో పర్యటి స్తామన్నారు. మంగళవారం మెరక ముడిదాం, గర్భాం, బైరిపురం, బిల్లలవలసలో పర్యటించి సభ్యత్వ నమోదు చేపట్టారు. యూటీ ఎఫ్‌ నాయకులు జిల్లా కార్యదర్శి కుసమన్న, సింహాద్రి నాయుడు, మండలశాఖ సభ్యులు రవికుమార్‌, రమేష్‌, రామారావు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-08-11T04:54:04+05:30 IST