మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యం

ABN , First Publish Date - 2021-02-05T05:44:44+05:30 IST

మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామంతోనే రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని మండలంలోని సెంచూరియన్‌ యూనివర్శిటీ వైస్‌ చాన్సలర్‌ ఆచార్య జీఎస్‌ఎన్‌ రాజు అన్నారు.

మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యం
మాట్లాడుతున్న సెంచూరియన్‌ వైస్‌ చాన్సలర్‌ రాజు

   ‘సెంచూరియన్‌’ వైస్‌ చాన్సలర్‌ రాజు

  ఘనంగా క్యాన్సర్‌ దినోత్సవం

నెల్లిమర్ల, ఫిబ్రవరి 4: మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామంతోనే రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని మండలంలోని సెంచూరియన్‌ యూనివర్శిటీ వైస్‌ చాన్సలర్‌ ఆచార్య జీఎస్‌ఎన్‌ రాజు అన్నారు. ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని యూనివర్శిటీలో గురువారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయ న ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మంచి ఆహారపు అలవాట్లతో క్యాన్సర్‌ ముప్పునకు దూరంగా ఉండవచ్చన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ గోపీనాఽథ్‌, శాంతమ్మ, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

 

 


Updated Date - 2021-02-05T05:44:44+05:30 IST