46 డిజిటల్‌ లైబ్రరీ భవనాలు మంజూరు

ABN , First Publish Date - 2021-08-28T05:27:24+05:30 IST

బొబ్బిలి పంచాయతీరాజ్‌ సబ్‌డివిజన్‌ పరిధిలో నాలుగు మండ లాలకు 46 డిజిటల్‌ లైబ్రరీ భవనాలు మంజూరైనట్లు పీఆర్‌ డీఈఈ సీహెచ్‌ అప్పారావు తెలిపారు.

46 డిజిటల్‌ లైబ్రరీ భవనాలు మంజూరు

బొబ్బిలి రూరల్‌: బొబ్బిలి పంచాయతీరాజ్‌ సబ్‌డివిజన్‌ పరిధిలో నాలుగు మండ లాలకు 46 డిజిటల్‌ లైబ్రరీ భవనాలు మంజూరైనట్లు పీఆర్‌ డీఈఈ సీహెచ్‌  అప్పారావు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఒక్కో భవనం రూ.16 లక్షలతో నిర్మించనున్నామన్నారు. బాడంగి మండలంలో 11, రామభద్రపురం మం డలంలో 4, బొబ్బిలి మండలంలో 27, తెర్లాం మండలంలో నాలుగు చొప్పున లైబ్రరీ భవనాలు మంజూరయ్యాయన్నారు. స్థలసేకరణ ప్రక్రియ జరుగుతోందని, త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. రూ.21.8 లక్షలతో 20 ఆర్‌బీకేలు, రూ. 40 లక్షలతో 14 సచివాలయ భవనాల నిర్మాణం పూర్తయ్యిందన్నారు. ఉపాధి బిల్లులకు సంబం ధించి తొలివిడతగా రూ.ఐదులక్షల  లోపు విడుదల చేస్తున్నారని తెలిపారు.

 

Updated Date - 2021-08-28T05:27:24+05:30 IST