ఆస్పత్రికి వెళ్తూ..

ABN , First Publish Date - 2021-03-22T04:55:55+05:30 IST

గిరిజన బాలిక మృతిచెందినట్లు తెలుసుకుని ఆస్పత్రికి వెళ్తున్న ఇద్దరు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని మృతిచెందారు. డుమ్మంగి గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కేదారిపురం కాలనీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న హారతి(15) డయేరియాతో ఆదివారం మృతిచెందింది.

ఆస్పత్రికి వెళ్తూ..
సంతోష్‌, అన్నాజీరావు(ఫైల్‌)

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని ఇద్దరి మృతి

గుమ్మలక్ష్మీపురం, మార్చి 21: గిరిజన బాలిక మృతిచెందినట్లు తెలుసుకుని ఆస్పత్రికి వెళ్తున్న ఇద్దరు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని మృతిచెందారు. డుమ్మంగి గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కేదారిపురం కాలనీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న హారతి(15) డయేరియాతో ఆదివారం మృతిచెందింది. ఈ విషయం హాస్టల్‌ వార్డెన్‌ లక్ష్మి తన భర్త నడుకూరి సంతోష్‌ (35)కు తెలిపింది. వెంటనే ఆయన హుటాహుటిన స్నేహితుడు మాగిరెడ్డి అన్నాజీరావు (26)తో కలిసి బైక్‌పై పార్వతీపురం బయలుదేరారు. గుమ్మలక్ష్మీపురం  మండలం డుమ్మంగి గ్రామ సమీపానికి వచ్చేసరికి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్నారు. తీవ్ర గాయాలతో సంతోష్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. అన్నాజీరావును పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎల్విన్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంతోష్‌ స్వగ్రామం గుమ్మలక్ష్మీపురం మండలం మంద కాగా ఈయనకు ఇద్దరు పిల్లలు. అన్నాజీరావుది ఎల్విన్‌పేట గ్రామం. ఈయన కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. ఈయనకు భార్య దేవి, మూడు నెలల పాప ఉంది.


Updated Date - 2021-03-22T04:55:55+05:30 IST