దొంగల ముఠా అరెస్టు

ABN , First Publish Date - 2021-03-22T05:33:28+05:30 IST

జిల్లాలో పలు ప్రాంతాల్లో దారి దోపిడీకి పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్టు చేసినట్టు సీసీఎస్‌ డీఎస్పీ జె.పాపారావు ఆదివారం తెలిపారు.

దొంగల ముఠా అరెస్టు

విజయనగరం క్రైం, మార్చి 21: జిల్లాలో పలు ప్రాంతాల్లో దారి దోపిడీకి పాల్పడుతున్న  దొంగల ముఠాను అరెస్టు చేసినట్టు సీసీఎస్‌ డీఎస్పీ జె.పాపారావు ఆదివారం తెలిపారు. జిల్లాలోని నెల్లిమ ర్ల పోలీసుస్టేషన్‌, వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో నేరాలకు పాల్పడిన మహిళా దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. ఈనెల 15న రాత్రి సమయంలో నెల్లిమర్ల మండలం గుషిణి గ్రా మం వద్ద ఒక మహిళ ఆటో దిగి నడుచుకుని వెళ్తుం డగా, గుర్తు తెలియని ముగ్గురు మహిళలు ఆమెపై దాడి చేసి బలవంతంగా ఆమె బ్యాగులు లాక్కొని సుమారు లక్ష విలువచేసే పుస్తెలతాడును లాక్కొని వెళ్లినట్టు తెలిపారు. దీనిపై నెల్లిమర్ల పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. అలాగే విజయ నగరం పట్టణంలోని బాలాజీ జంక్షన్‌ వద్ద నడుచుకుని వెళ్తుండగా, ఆమె వద్ద నుంచి రూ.15వేలను దోపిడీ చేసినట్టు ఫిర్యాదులు అందాయి. ఈ కేసులపై విచార ణ చేపట్టిన పోలీసులు వెంటనే దారి దోపిడీలకు పాల్పడుతున్న పాత నేరస్థుల ఆచూకీపై దృష్టి సారించారు. విజయనగరం రూరల్‌ సీఐ మంగవేణి, నెల్లిమర్ల ఎస్‌ఐ దామోదర్‌లకు వచ్చిన సమాచారం మేరకు నెల్లిమర్ల మొయిద జంక్షన్‌ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న విశాఖ జిల్లా కె.కోటపాడుకు చెందిన రావుల ఎల్లారమ్మ, కొత్తవలసకు చెందిన గంటా కాళేశ్వరీ, ఎల్‌కోట మండలం రంగాపురా నికి చెందిన మేకల లక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారించగా, పై నేరాలకు పాల్ప డినట్టు అంగీకరించినట్టు తెలిపారు. వీరి వద్ద నుంచి పుస్తెలతాడు, రూ.15వేల నగదుని స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ పాపారావు చెప్పారు. దోపిడీ ముఠాలను అరెస్టు చేయడంలో కీలకపాత్ర వహించిన డీఎస్పీ పాపారావు, సీఐ మంగవేణి, ఎస్‌ఐ దామోదర్‌, సన్యాసిరావు, సిబ్బంది నాగేంద్రప్రసాద్‌, శ్రీనివాసరావు, వాసు లను ఎస్పీ రాజకుమారి అభినందించారు. 

Updated Date - 2021-03-22T05:33:28+05:30 IST