రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు

ABN , First Publish Date - 2021-08-28T05:18:05+05:30 IST

ఒడిశా సరిహద్దు అలమండ వద్ద శుక్రవారం రెండు బైకులు ఎదురె దురుగా ఢీకొన్న ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు

బెలగాం: ఒడిశా సరిహద్దు అలమండ వద్ద శుక్రవారం రెండు బైకులు ఎదురె దురుగా ఢీకొన్న ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రి ఔట్‌పోస్టు పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. వీరఘట్టాం మండలం కంబర గ్రామానికి చెందిన చప్ప రంగారావు, చిలకపల్లి నాగరాజులు సీతానగరం మండలం కొత్తవలస గ్రామానికి వెళ్లాల్సి ఉండగా, పొరపాటున ఒడి శా సరిహద్దు అలమండ దాటి వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. అదే సమయంలో స్థానిక వైకేఎం కాలనీకి చెందిన సంపత్‌కుమార్‌, పరడాల త్రినాధలు అలమండ వెళ్తున్నారు. ఈ రెండు బైకులు ప్రమాదవశాత్తు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చప్ప రంగారావు తలకు బలమైన గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. సంపత్‌కుమార్‌కు శరీరంలో పలు చోట్ల తీవ్ర రక్తస్రావం జరగ్గా, త్రినాధ, నాగరాజులకు స్వల్ప గాయాలయ్యాయి. 108 వాహనంలో స్థానికులు వీరిని పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నరు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Updated Date - 2021-08-28T05:18:05+05:30 IST