పెండింగ్‌ కేసులపై దృష్టి

ABN , First Publish Date - 2021-10-30T04:14:06+05:30 IST

పెండింగ్‌ కేసులపై దృష్టి సారించి.. దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ దీపికాపాటిల్‌ ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీ సు కార్యాలయంలో ఆ శాఖ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ఎస్‌ఈబీ కేసుల్లో వాహనాల విడుదలకు సత్వర చర్యలు చేపట్టాలన్నారు. భూ తగాదాలకు సంబంధించిన కేసుల్లో రెవెన్యూ అధికారుల సహకారం తీసుకోవాలని సూచించారు.

పెండింగ్‌ కేసులపై దృష్టి
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ దీపికాపాటిల్‌
సత్వర పరిష్కార మార్గం చూపండి

ఎస్పీ దీపికాపాటిల్‌

విజయనగరం క్రైం, అక్టోబరు 29: పెండింగ్‌ కేసులపై దృష్టి సారించి.. దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ దీపికాపాటిల్‌ ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీ సు కార్యాలయంలో ఆ శాఖ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ఎస్‌ఈబీ కేసుల్లో వాహనాల విడుదలకు సత్వర చర్యలు చేపట్టాలన్నారు. భూ తగాదాలకు సంబంధించిన కేసుల్లో రెవెన్యూ అధికారుల సహకారం తీసుకోవాలని సూచించారు. వారి నుంచి నివేదికలు తెప్పించుకొని దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కఠిన చర్యలు ఉపక్రమించాలని ఆదేశించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే జోన్లను గుర్తించాలని సూచించారు. అక్కడ సూచిక బోర్డులు, స్టాపర్లు, డ్రమ్ములను ఏర్పాటు చేయాలన్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌లపై కూడా కన్నేసి ఉంచాలన్నారు. అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో తనిఖీలు పెరగాలని ఎస్పీ ఆదేశించారు. గంజాయి రవాణాను నియంత్రించడంలో ప్రతిభ చూపిన పాచిపెంట ఎస్‌ఐ ఎంవీ రమణ, కానిస్టేబుల్‌ సుబ్బలక్ష్మిలకు ప్రోత్సాహక బహుమతులు అందించారు. పైడితల్లమ్మ పండుగను దిగ్విజయంగా పూర్తి చేసినందుకు పోలీస్‌ యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. జిల్లా పోలీస్‌ శాఖకు చెందిన వాహనాలను అదనపు ఎస్పీ సత్యనారాయణరావు తనిఖీ చేశారు. వాహనాల పనితీరు రికార్డులను పరిశీలించారు. ఎంటీఓ నాగేశ్వరరావు, ఏఎస్పీ సత్యనారాయణరావు, శ్రీదేవిరావు, సూర్యచంద్రరావు, డీఎస్పీలు అనిల్‌కుమార్‌, ఎల్‌.మోహనరావు, త్రినాథ్‌, ఆర్‌.శ్రీనివాసరావు, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-30T04:14:06+05:30 IST