తండ్రీ కొడుకుల మధ్య పోరు!
ABN , First Publish Date - 2021-02-07T05:05:21+05:30 IST
పంచాయతీ ఎన్నికల్లో సమీప బంధువులే ప్రత్య ర్థులుగా మారుతున్నారు. ఒకరిపై ఒకరు బరిలో దిగుతున్నారు

రామభద్రపురం: పంచాయతీ ఎన్నికల్లో సమీప బంధువులే ప్రత్య ర్థులుగా మారుతున్నారు. ఒకరిపై ఒకరు బరిలో దిగుతున్నారు. మండల పరిధి దుప్పలపూడి పంచాయతీలో సొంత పెద్దనాన్నపైనే ఒక యువకుడు పోటీ చేస్తున్నారు. ఒకే పార్టీలో ఉంటున్న ఆ కుటుంబంలో తొలుత ఉపాధ్యా యుడిగా పదవీవిరమణ పొందిన వ్యక్తి నామినేషన్ వేయగా...డిగ్రీ పూర్తి చేసిన సోదరుడు కుమారుడు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఇక్కడ తండ్రీ కొడుకుల మధ్య పోటీ అనివార్యమైంది. సమీప కుటుంబసభ్యులు, బంధువులు ఎవరిపక్షాన నిలవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.