మహిళ మృతదేహం గుర్తింపు

ABN , First Publish Date - 2021-11-22T05:16:49+05:30 IST

అదృశ్యమైన మహిళ మృతదేహాన్ని తాటిపూడి జలాశయంలో గుర్తించారు.

మహిళ మృతదేహం గుర్తింపు

గంట్యాడ, నవంబరు 21: అదృశ్యమైన మహిళ మృతదేహాన్ని తాటిపూడి జలాశయంలో గుర్తించారు. ఓ మహిళ తాటిపూడి రిజర్వాయిర్‌లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు సీసీ ఫుటేజీలో రికార్డయిన సంగతి తెలిసిందే.. విజయనగరం పట్టణానికి చెందిన కాకర్లపూడి అనిత(36) శనివారం ఉదయం ద్విచక్రవాహనంపై తాటిపూడి జలాశయం వద్దకు వచ్చింది. తాను కార్తీకదీపం రిజర్వాయిర్‌లో విడిచి పెడతానని స్థానిక పోలీసులకు ఆమె కోరింది. అయితే రిజర్వాయిర్‌ గట్టుపైకి ఎవరికీ అనుమతి లేదంటూ పోలీసులు చెప్పడంతో ఆమె వెంటనే కిందకు వచ్చి సమీపంలో ఉన్న ఆలయం వద్ద తన ద్విచక్రవాహనాన్ని నిలిపి, మెట్లపై నుంచి రిజర్వాయిర్‌ పైకి వెళ్లింది. అక్కడ తన బ్యాగును ఉంచి జలాశయంలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే మృతదేహం లభ్యం కాకపోవడంతో పోలీసులు.. మహిళ అదృశ్యంగా కేసు నమోదు చేశారు. ఆదివారం మృతదేహం లభ్యమైంది. దీంతో శవ పంచనామ నిర్వహించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. 

 

Updated Date - 2021-11-22T05:16:49+05:30 IST