ఉత్సాహంగా క్రికెట్‌ పోటీలు

ABN , First Publish Date - 2021-01-13T05:45:55+05:30 IST

బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నగరంలోని విజ్జీ స్టేడియంలో జరిగిన క్రికెట్‌ పోటీలు ఉత్సాహంగా సాగాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో పైడిమాంబ జట్టు విజేతగా నిలిచింది.

ఉత్సాహంగా క్రికెట్‌ పోటీలు
విజేతలకు ట్రోఫీ అందిస్తున్న బొత్స చైతన్య

విజయనగరం దాసన్నపేట : బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నగరంలోని విజ్జీ స్టేడియంలో జరిగిన క్రికెట్‌ పోటీలు ఉత్సాహంగా సాగాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో పైడిమాంబ జట్టు విజేతగా నిలిచింది. ఈ మేరకు మంగళవారం వైసీపీ యువజన విభాగం నాయకుడు బొత్స చైతన్య వీరికి ట్రోఫీని అందజేశారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు రాకేష్‌శర్మ, గోవిందరావు, సత్యప్రసాద్‌, పేరి రామయ్యపంతులు, సురేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-13T05:45:55+05:30 IST