పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

ABN , First Publish Date - 2021-02-06T05:08:28+05:30 IST

పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యతని కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ అన్నారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
దత్తిరాజేరు: కోమటిపల్లిలో మొక్కలు నాటుతున్న కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

  కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ 

దత్తిరాజేరు, ఫిబ్రవరి 5: పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యతని కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ అన్నారు. కోమటిపల్లి గ్రామంలోగల శివరామసాగరం చెరువు, జగ్గుగుప్తవాని చెరువు గట్లుపై ఆయన శుక్రవారం మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ వారి ఇంటి వద్ద మొక్కలు నాటాలని సూచించారు.  అనంతరం సచివాలయ సిబ్బందితో మాట్లాడుతూ గ్రామాల్లో పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. చెరువులను కలుషితం చేయకుండా అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎంవీ సుబ్రహ్మణ్యం,  జిల్లా అటవీ అధికారి బి.జానకీరావు, ఏపీవో సత్యవతి, చేయూత ఫౌండేషన్‌ అధ్యక్షుడు ఎం.రాము, సాయిసిద్ధార్థ కళాశాల కరస్పాడెంట్‌ శీరంరెడ్డి చంద్రశేఖర్‌, మండల శాఖ అధికారులు పాల్గొన్నారు.

 

 

Updated Date - 2021-02-06T05:08:28+05:30 IST