వృత్తి విద్యా నైపుణ్య శిక్షణతో ఉపాధి
ABN , First Publish Date - 2021-02-07T05:18:08+05:30 IST
వృత్తి విద్యా నైపుణ్య శిక్షణతో మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ హరిజవహర్‌లాల్ తెలిపారు.

దాసన్నపేట, ఫిబ్రవరి 6: వృత్తి విద్యా నైపుణ్య శిక్షణతో మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ హరిజవహర్‌లాల్ తెలిపారు. జమ్మునారా యణపురం లోని అశోక్ బీఈడీ కళాశాలలో నిరుద్యోగ యువతీయువకులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులను ఆయన శనివారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోటీ ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం తప్పనిసరి అని, ఆ దిశగా యువతీ, యువకులు ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. సంస్థ ప్రతినిధి రమేష్ మాట్లాడుతూ.. ఈ శిక్షణ తరగతులు మూడు నెలల పాటు కొనసాగుతాయని చెప్పారు. 15 నుంచి 35 ఏళ్ల లోపు వారి అర్హులని, కనీస విద్యార్హత పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లమో అని తెలిపా రు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సౌకర్యాలు, ట్రైనింగ్ మెటీరియల్, యూనిఫాం ఇస్తామన్నారు. ఇతర వివరాలకు 94918 37643, 79955 92678 నెంబరును సంప్రదించా లని తెలిపారు. శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన పఽథకంలో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సీ-డాప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు.