వృద్ధుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-12-29T05:21:41+05:30 IST

ఎలుకల మందు తాగి ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జామి గ్రామంలో మంగళవా రం చోటుచేసుకుంది.

వృద్ధుడి ఆత్మహత్య

శృంగవరపుకోట రూరల్‌ (జామి), డిసెంబరు 28: ఎలుకల మందు తాగి ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జామి గ్రామంలో మంగళవా రం చోటుచేసుకుంది. మృతుడి భార్య దేముడమ్మ, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జామి గ్రామానికి చెందిన నేపర్తి కోటయ్య(75) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మందులు వాడినా ఫలితం కానరాలే దు. మంగళవారం తన భార్య కులవృత్తిలో భాగంగా బట్టలు ఉతికేందుకు బయట కు వెళ్లగా,  ఇంట్లో ఉన్న ఎలుకల మందును తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంట నే స్థానికులు గుర్తించి, భార్యకు సమాచారం ఇవ్వడంతో స్థానిక పీహెచ్‌సీకి తరలిం చారు. పరిస్థితి విషమించడంతో విజయనగరం మహారాజ ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతిచెందాడు. ఈ సంఘటనపై ఏఎస్‌ఐ గోపి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

 

Updated Date - 2021-12-29T05:21:41+05:30 IST