కొత్తవలస అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2021-06-22T05:41:38+05:30 IST

కొత్తవలస మేజర్‌ పంచాయతీ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని విశాఖపట్టణం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు.

కొత్తవలస అభివృద్ధికి కృషి

విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ 

కొత్తవలస, జూన్‌ 21: కొత్తవలస మేజర్‌ పంచాయతీ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని విశాఖపట్టణం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు. సోమవారం కొత్తవలస మేజర్‌ పంచాయతీ మొదటి పాలకవర్గ సర్వసభ్య సమా వేశం సర్పంచ్‌ మచ్చ రామస్వామి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజ రైన ఎంపీ మాట్లాడుతూ కార్యనిర్వాహక రాజధాని కానున్న విశాఖ ప్రాంతానికి కొత్త వలస సమీపంలోనే ఉండడంతో ఈ ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. కొత్తవలస మేజర్‌ పంచాయతీలో అభివృద్ధి పనులకోసం ఎంపీ నిధులను   మంజూ రు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. పంచాయతీ పరిధిలోని సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే నిధులను మంజూరు చేస్తానన్నారు. ఎమ్మెల్యే కడుబండి శ్రీని వాసరావు మాట్లాడుతూ కొత్తవలస మండలంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చెందా ల్సి ఉందన్నారు. కొత్తవలస మేజర్‌పంచాయతీ అభివృద్ధి కోసం సభ్యులు, సర్పంచ్‌ సమిష్టిగా కృషి చేయాలన్నారు. కొత్తవలస మేజర్‌ పంచాయతీలో పందుల నిర్మూ లనకోసం యజమానులకు నోటీసులు ఇవ్వాలని, స్పందించకపోతే నిర్మూలన చర్య లు చేపట్టాలని తీర్మానం చేశారు. కొత్తవలస శ్మశానవాటిక సుందరీకరణకు నిధులు సేకరించాలని తీర్మాణించారు. పిలిచిన వెంటనే సమావేశానికి హాజరైనందుకు ఎంపీ, ఎమ్మెల్యేలకు సర్పంచ్‌ మచ్చ రామస్వామి కృతజ్ఞతలు తెలిపారు. 


Updated Date - 2021-06-22T05:41:38+05:30 IST