ప్రజారోగ్యంతో చెలగాటమొద్దు

ABN , First Publish Date - 2021-12-31T05:36:47+05:30 IST

గతంలో ఎన్నడూ లేనివిధంగా మద్యాన్ని నాసిరకం కొత్త బ్రాండ్లతో అమ్మకం చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంతో చెలగాటాలాడు తోందని టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వనజాక్షి ఆరోపించారు.

ప్రజారోగ్యంతో చెలగాటమొద్దు
మద్యం సీసాలు పగులగొట్టి నిరసన తెలుపుతున్న దృశ్యం

 టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వనజాక్షి

 నెల్లిమర్ల, డి సెంబరు 30: గతంలో ఎన్నడూ లేనివిధంగా మద్యాన్ని నాసిరకం కొత్త బ్రాండ్లతో అమ్మకం చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంతో చెలగాటాలాడు తోందని టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వనజాక్షి ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాల తీరుపై పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో స్థానిక రామతీర్థం జంక్షన్‌ వద్ద గురువారం నిరసన చేపట్టారు. వనజాక్షితో పాటు పలువురు మహిళా నాయకులు మద్యం సీసాలను ధ్వంసంచేసి, నిరసన తెలిపారు. ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి అనురాధా బేగం, పార్లమెంటరీ కమిటీ కార్యదర్శి లెంక హైమావతి, రెడ్డి సంతోషి, పార్టీ నాయకురాళ్లు చిల్లా పద్మావతి, నరవ రామలక్ష్మి, ముడిమంచి లక్ష్మి, మజ్జి అన్నపూర్ణ, ఆల్తి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-12-31T05:36:47+05:30 IST