బాధితులకు న్యాయం చేయండి

ABN , First Publish Date - 2021-10-07T05:45:39+05:30 IST

బాధితులకు న్యాయం చేయండి

బాధితులకు న్యాయం చేయండి
నిర్వాసితులతో మాట్లాడుతున్న కృష్ణమూర్తి

కురుపాం : గిరిజన ఇంజినీరింగ్‌ కళాశాల నిర్వాసితులకు భూమికి భూమి ఇవ్వాలని, లేకుంటే 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించి బాధితులకు న్యాయం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.కృష్ణమూర్తి డిమాండ్‌ చేశారు. కురుపాంలో అఖిల పక్షం ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని బుధవారం ఆయన సందర్శించారు. అనంతరం ఇంజనీరింగ్‌ కళాశాల నిర్మాణ పనులను, నిర్వాసితుల భూమిని పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు, మాజీ ఏఎంసీ చైర్మన్‌ కోలా రంజిత్‌ కుమార్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు, ఆదివాసీ వికాస్‌ పరిషత్‌ జిల్లా ఉపాధ్యాక్షుడు పువ్వల సత్కన్నారాయణ తరదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-07T05:45:39+05:30 IST