సమన్వయంతోనే జిల్లా ప్రగతి సాధ్యం
ABN , First Publish Date - 2021-10-30T04:53:03+05:30 IST
సమన్వయంతో అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేసినప్పుడే జిల్లా ప్రగతి సాధ్యమవుతుందని జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం 3, 5, 6 స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు.

స్థాయీ సంఘ సమావేశంలో జడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు
విజయనగరం (ఆంధ్రజ్యోతి): సమన్వయంతో అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేసినప్పుడే జిల్లా ప్రగతి సాధ్యమవుతుందని జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం 3, 5, 6 స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు. జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ... గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సకాలంలో పౌష్టికాహారాన్ని అందజేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు మరమ్మతు లు చేపట్టాలని, భవన నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. కేంద్రాలను పాఠశాలల్లో విలీనం చేసే ముందు ఐసీడీఎస్, పీఆర్ ఇంజి నీరింగ్ అధికారులు భవనాలను తనిఖీ చేయాలని సూచించారు. సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన రైతు భరోసా నిధులను వెంటనే అన్నదాతల ఖాతా ల్లో జమ చేయాలన్నారు. వసతి గృహాలను పూర్తిస్థాయిలో తెరవాల న్నారు. కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ.. అంగన్‌వాడీల్లో చిన్నారుల హాజరులో జిల్లా ముందంజలో ఉందని తెలిపారు. అంగన్ వాడీ కేంద్రాల మరమ్మతులకు 15వ ఆర్థిక సంఘం నిధులు వినియోగించాలన్నారు. ఇది లా ఉండగా స్థాయీ సంఘ సమావేశాలకు కొందరు అధికారులు హాజరు కాకపోవడంపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మె ల్యేలు శంబంగి, కడుబండి, జడ్పీ వైస్ చైర్మన్ బాపూజీ నాయుడు, సంఘాల సభ్యులు శాంతికుమారి, అప్పలనాయుడు, జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు, ఐసీడీఎస్ పీడీ రాజేశ్వరి, వ్యవసాయ శాఖ జేడీ తారకరామారావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సునీల్‌రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. దాసన్నపేట: జిల్లా కేంద్రంలోని జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళా శాలను విశ్వవిద్యాలయంగా మార్చుతూ... గురజాడ యూనివర్సిటీగా నామ కరణం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలపడంపై జడ్పీ చైర్మన్ శ్రీనివాస రావు హర్షం వ్యక్తం చేశారు.