ఆక్సిజన్‌ సిలిండర్ల వితరణ

ABN , First Publish Date - 2021-05-14T04:48:57+05:30 IST

సాలూరు సీహెచ్‌సీకి ప్రాణదాత చారిటబుల్‌ ట్రస్ట్‌ గురువారం పది ఆక్సిజన్‌ సిలిం డర్లను వితరణ చేసింది.

ఆక్సిజన్‌ సిలిండర్ల వితరణ

సాలూరు రూరల్‌, మే 13: సాలూరు సీహెచ్‌సీకి ప్రాణదాత చారిటబుల్‌ ట్రస్ట్‌ గురువారం పది ఆక్సిజన్‌ సిలిం డర్లను వితరణ చేసింది. ఈ సిలిండర్లను ట్రస్ట్‌ నిర్వాహకుడు డాక్టర్‌ గణేశ్వరరావు సీహెచ్‌సీ సూపరింటెండెం ట్‌ రామమూర్తికి అందజేశారు. ఇటీవల సాలూరులోని ఫిల్డెఫియా ఆసుపత్రికి 40 ఆక్సిజన్‌ సిలిండర్లు అందించామని చెప్పారు. ఫ్లోమీటర్‌ కిట్స్‌ కూడా అందజే శామన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్‌ నిర్వాహకులు గంటా వెంకటరాజు, రవ్వా శ్యామ్‌శంకర్‌, కోడూరు సాయి, వెంకటేశ్వరరావు, అర్బన్‌ బ్యాంకు అధ్యక్షుడు భీమారావు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-14T04:48:57+05:30 IST