ఎల్లారమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2021-03-22T05:00:57+05:30 IST

జామి ఎల్లారమ్మ జాతర చూసేందుకు భక్తులు తరలివచ్చారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన జనంతో జాతర ప్రాంతమంతా కోలాహలంగా మారింది. శనివారం రాత్రి 9గంటల నుంచి అదివారం రాత్రి వరకు భక్తులు ఒకే రీతిన రావడంతో ఆలయ పరిసరాలతో పాటు గ్రామమంతా నడవడానికి దారి లేకపోయింది

ఎల్లారమ్మ జాతరకు   పోటెత్తిన భక్తులు
విజయనగరం: జాతరకు విశేషంగా హాజరైన భక్తులు

ఎల్లారమ్మ జాతరకు 

పోటెత్తిన భక్తులు

 లక్షల సంఖ్యలో రాక

శృంగవరపుకోట రూరల్‌ (జామి)మార్చి 21: జామి ఎల్లారమ్మ జాతర చూసేందుకు భక్తులు తరలివచ్చారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన జనంతో జాతర ప్రాంతమంతా కోలాహలంగా మారింది. శనివారం రాత్రి 9గంటల నుంచి అదివారం రాత్రి వరకు భక్తులు ఒకే రీతిన రావడంతో ఆలయ పరిసరాలతో పాటు గ్రామమంతా నడవడానికి దారి లేకపోయింది. దాదాపు 2లక్షల మంది భక్తులు వచ్చారని అంచనా. జాతరకు దేవదాయ శాఖ పక్కా ఏర్పాట్లు చేసింది. శనివారం రాత్రి 9.45 గంటల తరువాత జామి గ్రామ చుక్క వీధిలో వున్న ఆలయ పూజారి ఇంటి గద్దె నుంచి అమ్మవారిని దించారు. ప్రత్యేక పూజల అనంతరం అక్కడ నుంచి మేళతాళాలు, బాణా సంచాతో ఊరిగేంపుగా ఎల్లారమ్మను రాత్రి 1.30 ప్రాంతంలో ఆలయానికి తీసుకువచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొనేందుకు దేవదాయ శాఖ క్యూలైన్‌లను ఏర్పాటు చేసింది. జాతరకు వచ్చే భక్తులకు వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. 

 విజయనగరంలో ఘనంగా ఎల్లారమ్మ జాతర 

 ఎల్లారమ్మ జాతర విజయనగరంలోనూ వైభవంగా జరిగింది. మహారాజా ప్రభుత్వ సంగీత కళాశాల, నల్లచెరువు వద్ద వున్న ఎల్లమ్మ ఆలయాల వద్ద ఉదయం నుంచి భక్తుల కోలాహలం కన్పించింది. సిరులు కురిపించే తల్లిగా ఎల్లమ్మ తల్లిని ప్రజలు భావిస్తారు. సంగీత కళాశాల వద్దనున్న ఆలయానికి భారీగా జనం తరలివచ్చారు. ఇక్కడ తొలేళ్ల ఉత్సవం అనంతరం ఆదివారం సిరిమానోత్సవం జరిగింది. విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఎల్లమాంబను దర్శించుకుని పూజలు నిర్వహించారు. సిరిమాను సాయంత్రం ఆలయం చుట్టూ మూడు పర్యాయాలు ప్రదక్షిణ చేసింది. అనంతరం భక్తుల సందర్శనార్థం సిరిమానును ఆలయం ముందే ఉంచారు. ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. Updated Date - 2021-03-22T05:00:57+05:30 IST