‘క్రాస్‌’లో జాప్యం.. ప్ర‘జల’కు కష్టం!

ABN , First Publish Date - 2021-05-21T05:18:19+05:30 IST

వేసవి నేపథ్యంలో పల్లెల్లో తాగునీటి ఎద్దడి నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నా... క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. సకాలంలో నిర్వహించాల్సిన క్రాస్‌ ప్రోగ్రాంజాప్యమవుతుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‘క్రాస్‌’లో జాప్యం.. ప్ర‘జల’కు కష్టం!
చినమేరంగిలో బోరు పనిచేయకపోవడంతో ఆవు దూడను కట్టి ఉంచిన దృశ్యం

  మార్చిలో జరగాల్సి ఉన్నా.. పూర్తికాని వైనం   

 పల్లెవాసులకు తప్పని తాగునీటి ఇక్కట్లు  

 ఇప్పుడు నిర్వహించేందుకు సన్నాహాలు

(జియ్యమ్మవలస)

వేసవి నేపథ్యంలో పల్లెల్లో తాగునీటి ఎద్దడి నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నా... క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. సకాలంలో నిర్వహించాల్సిన క్రాస్‌ ప్రోగ్రాంజాప్యమవుతుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  పల్లె వాసులు తీగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవంగా మం డలంలో 31 పంచాయతీ పరిధిలో 52,832 మంది జనాభా ఉన్నారు. వీరికి తాగునీరు అందించేందుకు 469 చేతి పంపులు, 23  బావులు, 7 డైరెక్ట్‌ పం పింగ్‌లు, 10 ఎంపీడబ్ల్యూ స్కీములు, 36 పీడబ్ల్యూ స్కీములు, 15 సోలార్‌ సిస్టమ్‌లు ఉన్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 5.09 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులు మార్చిలోనే ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిసింది.  ఈ మొత్తంతో మార్చి చివరి వారంలో గాని, ఏప్రిల్‌ మొదటి వారంలో గాని క్రాస్‌ ప్రోగ్రాం ప్రారంభించి ఇప్పటికే పూర్తి చేయాల్సి ఉంది. కానీ సంబంధిత అధికారులు కనీస చర్యలు తీసుకోలేదు.  ఇదిలా ఉండగా క్రాస్‌ ప్రోగ్రాంకు సంబంధించి కొద్దిపాటి మెటీరియల్‌ తెచ్చి ఎంపీడీవో కార్యాలయంలో ఓ మూలన పడేశారు. ఇప్పుడు తొలకరి సమీపించే సమయా నికి క్రాస్‌ ప్రోగ్రాం చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు తూతూ మంత్రంగా పనులు చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధి కారులు స్పందించి క్రాస్‌ ప్రోగ్రాం జాప్యానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని మండలవాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

చర్యలు తీసుకుంటున్నాం

క్రాస్‌ ప్రోగ్రాం నిర్వహణలో జాప్యం జరగడం వాస్తవమే. దీనికి కారణం హైదరాబాద్‌ నుంచి మెటీరియల్‌ సకాలంలో రాకపోవ డమే. క్రాస్‌ ప్రోగ్రాం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 

- కె.నాగేశ్వరరావు, డీఈఈ, ఆర్‌డబ్ల్యూఎస్‌,

 కురుపాం సబ్‌ డివిజన్‌

 

Updated Date - 2021-05-21T05:18:19+05:30 IST