బోదకాలు నిర్మూలనకు సహకరించండి

ABN , First Publish Date - 2021-10-08T04:37:32+05:30 IST

బోద వ్యాధిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డీఈసీ మాత్రలు వేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టరు ఎస్‌వీ రమణకుమారి సూచించారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద ఫైలేరియా నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ఆమె లాంఛనంగా ప్రారంభించారు

బోదకాలు నిర్మూలనకు సహకరించండి
బోధకాల నివారణ సూచనల పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న డీఎంహెచ్‌వో రమణకుమారి

డీఎంహెచ్‌వో రమణకుమారి 

విజయనగరం రింగురోడ్డు, అక్టోబరు 7: బోద వ్యాధిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డీఈసీ మాత్రలు వేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టరు ఎస్‌వీ రమణకుమారి సూచించారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద ఫైలేరియా నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ఆమె లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, జిల్లాలో బోధ వ్యాధిని నిర్మూలించేందుకు ఏటా డీఈసీ మాత్రల పంపిణీని చేపడుతున్నామన్నారు. ఫైలేరియా బాధితులకు చికిత్సతో పాటు, శస్త్ర చికిత్సలు చేస్తున్నామన్నారు. వ్యాధి వచ్చిన తరువాత బాధపడడం కంటే రాకుండా ముందస్తుగా డీఈసీ మాత్రలు తీసుకోవడం మేలని సూచించారు. జిల్లాలో తొలి విడతగా 23 లక్షల 42 వేల 48 మందికి డీఈసీ, అల్బెండ్‌జోల్‌ మాత్రలను పంపిణీ చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగామన్నారు. ప్రారంభ కార్యక్రమంలో జాతీయ కీటక నివారణ కార్యక్రమం(ఎనవీబీడీసీపీ) డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టరు రామనాథం, జోనల్‌ మలేరియా అధికారి డాక్టర్‌ తిరుపతిరావు, అడిషనల్‌ డీఎంహెచ్‌వో రామ్మోహన్‌, డీఐఓ డాక్టరు నారాయణ, జిల్లా మలేరియా నివారణాధికారి ఎం.తులసీ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-08T04:37:32+05:30 IST