కరోనా నివారణకు సహకరించండి

ABN , First Publish Date - 2021-05-09T05:11:14+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు సూచించారు.

కరోనా నివారణకు సహకరించండి

విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు

విజయనగరం క్రైం, మే 8:  కరోనా సెకండ్‌ వేవ్‌  విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు సూచించారు.  ముఖ్యంగా పల్లెలు, పట్టణాల్లో యువత కరోనా నివారణకు నడుంబిగించాలని శనివారం ఓ ప్రకటనలో కోరారు. అత్యవసర పరిస్థితులు మినహా ఎవరూ బయటకు రాకుండా చూసుకోవా లన్నారు.  రెండు, మూడు రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు ప్రజలకు అందించాలని యువతకు సూచించారు.  కరోనాపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ ప్రజలకు మనో ధైర్యాన్నిచ్చే సందేశాలు అందించాలన్నారు. కరోనా బాధితులు  ఆందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇంటివద్దనే ఉంటూ  వైద్య సేవలు పొందాలన్నారు.  కర్ఫ్యూ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని, గుంపులుగా బయట తిరగరాదని సూచించారు. 

 

Updated Date - 2021-05-09T05:11:14+05:30 IST