హెచ్‌ఎంను బెదిరించిన కాంట్రాక్టర్..!
ABN , First Publish Date - 2021-02-02T05:21:27+05:30 IST
నాడు-నేడు పనులను కాంట్రాక్టరు అసంపూర్తిగా వదిలివేయడంతో వాటిని ప్రారంభించేందుకు పాఠశాల హెచ్‌ఎం సిద్ధమయ్యారు.

పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
కొమరాడ, ఫిబ్రవరి 1: నాడు-నేడు పనులను కాంట్రాక్టరు అసంపూర్తిగా వదిలివేయడంతో వాటిని ప్రారంభించేందుకు పాఠశాల హెచ్‌ఎం సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో హెచ్‌ఎంను బెదిరించి, దుర్భాషలాడడంతో సదరు కాంట్రాక్టర్‌పై హెచ్‌ఎం జానకమ్మ ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మండలంలోని పెదశేఖ ఎంపీఈపీ పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ పాఠశాలలో నాడు-నేడు పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించారు. అయితే పనులు నేటికీ పూర్తి చేయకపోవడంతో పాఠశాల హెచ్‌ఎం జానకమ్మ తన సొంత నిధులతో పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న పనులు చేయడానికి పూనుకున్నారు. ఈ సమయంలో నాడు-నేడు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ హెచ్‌ఎంపై దుర్భాషలాడి పనులు చేయకుండా అడ్డుపడ్డారు. ఈమేరకు కొమరాడ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు జానకమ్మ తెలిపారు. హెచ్‌ఎం ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ జ్ఞానప్రసాద్ సోమవారం పాఠశాలకు వెళ్లి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసుకోవచ్చునని హెచ్‌ఎంకు తెలిపారు. ఎవరైనా అడ్డుపడితే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.