వైద్య కళాశాల నిర్మాణానికి నేడు శంకుస్థాపన

ABN , First Publish Date - 2021-05-31T05:21:00+05:30 IST

విజయనగరంలోని గాజులురేగ వద్ద చేపట్టనున్న ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన జరుగనుంది. ఇందుకు సంబంధించి జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం జగన్‌ తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో పనులకు శంకుస్థాపన చేస్తారు.

వైద్య కళాశాల నిర్మాణానికి  నేడు శంకుస్థాపన
శంకుస్థాపన కార్యక్రమం కోసం సిద్ధం చేస్తున్న వేదిక

రూ.500 కోట్లతో పనులు

 గాజులురేగలో 70 ఎకరాల్లో నిర్మాణం 

కలెక్టరేట్‌, మే 30: విజయనగరంలోని గాజులురేగ వద్ద చేపట్టనున్న ప్రభుత్వ  వైద్య కళాశాల భవన నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన జరుగనుంది. ఇందుకు సంబంధించి జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం జగన్‌ తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో పనులకు శంకుస్థాపన చేస్తారు. గాజులురేగలోని సర్వే నెంబరు 1-89లో 70 ఎకరాలను ప్రభుత్వం వైద్య కళాశాలకు కేటాయించింది. నాగార్జున కనస్ట్రక్షన్‌ సంస్థ నిర్మాణాన్ని రూ.150 కోట్లతో చేపడుతోంది. మూడు సంవత్సరాల్లో పనులు పూర్తి చేయాల్సి ఉండగా 30 నెలల్లో పూర్తిచేస్తామని చెబుతోంది. 14 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు నిర్మించనున్నారు. కళాశాల నిర్మాణం పూర్తయితే 150 సీట్లతో తరగతులు ప్రారంభం అవుతాయి. బోధన, బోధనేతర సిబ్బంది కలిపి 200 మంది  పనిచేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు. నిర్మాణం పనులను ఆంధ్రప్రదేశ్‌ వైద్య సేవ మౌలిక సదుపాయాల అభివృద్థి సంస్థ ఎస్‌ఈ కె.శివకుమార్‌, ఈఈ ఎం.సత్య ప్రభాకర్‌లు పర్యవేక్షించనున్నారు. 

త్వరలోనే వైద్య కళాశాల సాకారం

చీపురుపల్లి : జిల్లా ప్రజలు ఎప్పటి నుంచో కలలు కంటున్న ప్రభుత్వ వైద్య కళాశాల త్వరలోనే సాకారం కాబోతోందని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ అన్నారు. ఆదివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. వైద్య కళాశాలకు వర్చువల్‌ పద్ధతిలో సీఎం జగన్‌ సోమవారం శంకుస్థాపన చేస్తారని చెప్పారు. Updated Date - 2021-05-31T05:21:00+05:30 IST