20లోగా ‘నాడు-నేడు’ పూర్తి చేయండి

ABN , First Publish Date - 2021-05-30T05:31:25+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న నాడు-నేడు తొలివిడత పనులు జూన్‌ 20లోగా పూర్తి చేయాలని జేసీ జె.వెంకటరావు ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

20లోగా ‘నాడు-నేడు’ పూర్తి చేయండి
మాట్లాడుతున్న జేసీ వెంకటరావు
కలెక్టరేట్‌, మే 29:  ప్రభుత్వ పాఠశాలల్లో  చేపడుతున్న నాడు-నేడు తొలివిడత  పనులు జూన్‌ 20లోగా పూర్తి చేయాలని జేసీ జె.వెంకటరావు ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో తొలివిడతగా 1060 పాఠశాలల్లో ఆరు ఇంజినీరింగ్‌ విభాగాల ఆద్వర్యంలోని పనులు చేసినట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు పూర్తి చేయాలన్నారు. పాఠశాలలకు డ్యూయెల్‌ డెస్క్‌ బోర్డు, తాగునీటి శుద్ధి పరికరాలు, టీవీలు, ఫర్నీచర్‌ అందజేశారని చెప్పారు. వాటి  పనులు జూన్‌ ఆరో తేదీ నాటికి పూర్తి  చేయాలని సూచించారు. వాల్‌ ఆర్ట్‌,పెయింట్స్‌ 20 నాటికి అన్ని పాఠశాలల్లో పూర్తి కావాలన్నారు. గిరిజన ప్రాంతాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో డీఈవో నాగమణి, సమగ్ర శిక్ష ఏపీవో గోపి, ఈఈ శివానంద్‌, ఏపీఇ డబ్ల్యూడీసీ శామ్యూల్‌, వీఎంసీ ఈఈ దిలీప్‌ తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-05-30T05:31:25+05:30 IST