భూ సర్వే త్వరగా పూర్తిచేయండి

ABN , First Publish Date - 2021-08-21T05:31:48+05:30 IST

మర్రి వలస గ్రామంలో చేపడుతున్న సమగ్ర భూసర్వే త్వరగా పూర్తిచేయాలని పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ భావ్న ఆదేశించారు. శుక్ర వారం తహసీల్దార్‌ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు.

భూ సర్వే త్వరగా పూర్తిచేయండి
అధికారులకు సూచనలిస్తున్న సబ్‌ కలెక్టర్‌

రామభద్రపురం:  మర్రి వలస గ్రామంలో చేపడుతున్న సమగ్ర భూసర్వే త్వరగా పూర్తిచేయాలని పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ భావ్న ఆదేశించారు.  శుక్ర వారం తహసీల్దార్‌ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు.  డివిజన్‌లో పైలెట్‌ విలేజ్‌గా మర్రివలసని ఎంపిక చేశామని, ప్రస్తుతం పాత, కొత్త సర్వే నెంబర్ల ఆధారంగా కోరిలేషన్‌ పనులు జరుగుతు న్నాయని తెలిపారు. ఇప్ప టికే డ్రోన్‌ కెమెరా ద్వారా సర్వే జరిగిందని, సెప్టెంబరు నెలాఖ రులోగా సర్వే పూర్తి చేయాలని సూచించారు.  దీనిపై సిబ్బంది అవగాహన పెంపొందిం చుకోవాలన్నారు.  కేవైసీపై వస్తున్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. చెరువు ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలన్నారు. అనంతరం  సర్వే మ్యాపులు, కంప్యూటర్‌లో పొందుపరిచిన అంశాలను పరిశీలించారు. డిప్యూటీ సర్వే ఇన్‌స్పెక్టర్‌ స్వరూప్‌, తహసీ ల్దార్‌ గణపతిరావు, ఆర్‌ఐ భానుప్రకాష్‌,  సర్వేయర్‌ నాగేశ్వరరావు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-08-21T05:31:48+05:30 IST