రెండుచోట్ల ఓటుహక్కుపై ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-02-06T05:11:04+05:30 IST

బూసాయ వలస సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ వేసిన ఓ అభ్యర్థినికి రెండుచోట్ల ఓటుహక్కు ఉండడంపై ప్రత్యర్థి అభ్యర్థి, టీడీపీ నాయకులు రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కె.ఈశ్వర రావుకు శుక్రవారం ఫిర్యాదు చేశారు.

రెండుచోట్ల ఓటుహక్కుపై ఫిర్యాదు

 రామభద్ర పురం,  : బూసాయ వలస సర్పంచ్‌  పదవికి నామినేషన్‌ వేసిన ఓ అభ్యర్థినికి రెండుచోట్ల ఓటుహక్కు ఉండడంపై ప్రత్యర్థి అభ్యర్థి, టీడీపీ నాయకులు రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కె.ఈశ్వర రావుకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో , విజయ నగరం జిల్లా బూసాయవలసలో కూడా ఓటుహక్కు ఉండడంపై ఆ నామినేషన్‌ తిరస్కరించాలని మడక తిరుపతిరావు, గంట సాయి, దేవర తిరుపతిరావు,  పాపారావులు  కోరారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఒకచోటే ఓటుహక్కు కలిగి ఉండాలన్నారు.  వాస్తవంగా ఈ పంచా యతీలో సర్పంచ్‌ అభ్యర్థిగా గంట సరోజిని,  రమణమ్మ,  ఫిబీ,  తిరుపతమ్మ నామినేషన్లు వేశారు.   బూసాయవలసలో ఓటరు జాబితాలో ఆమె పేరు ఉన్నందున ఆ నామినేష న్‌ను స్వీకరిస్తున్నామని రిటర్నింగ్‌ అధికారి ఈశ్వరరావు తెలిపారు.  రెండుచోట్ల ఓటుహక్కు ఉండకూడదనే నిబంధనేమీ తమ బుక్‌లోలేదని చెప్పారు.  ఇదిలా ఉండగా నామినేషన్ల స్ర్కూట్నీ కొనసాగుతుందన్నారు.  ఇదే పంచా యతీలో 7, 9 వార్డుల్లో ఓ ఓటరే ఇద్దరు వార్డు మెంబర్లకు ప్రతిపాదించడంపై కూడా టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం టీడీపీ నేత తిరుపతిరావు విలేఖర్లతో మాట్లాడుతూ... రిట ర్నింగ్‌ ఆఫీసర్‌ ఏకపక్ష నిర్ణయం తీసుకుంటు న్నారని ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నామని తెలిపారు. ఎస్‌ఐ ఎస్‌.కృష్ణమూర్తి, ట్రైనీ ఎస్‌ఐ కె.సీతారాం పరిస్థితిని సమీక్షించారు. 

 

Updated Date - 2021-02-06T05:11:04+05:30 IST