నష్టం లేకుండా సేకరణ

ABN , First Publish Date - 2021-12-31T04:29:18+05:30 IST

జిల్లా రైతులకు నష్టం కలగకుండా ధాన్యం సేకరిస్తామని కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి తెలిపారు. ప్రస్తుతం కొనుగోలు ప్రక్రియ జరుగుతోందని, అన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరిస్తున్నామని తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు.

నష్టం లేకుండా సేకరణ
మాట్లాడుతున్న కలెక్టర్‌ సూర్యకుమారి

కొనుగోలు ప్రక్రియ వేగవంతం: కలెక్టర్‌

కలెక్టరేట్‌, డిసెంబరు 30: జిల్లా రైతులకు నష్టం కలగకుండా ధాన్యం సేకరిస్తామని కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి తెలిపారు. ప్రస్తుతం కొనుగోలు ప్రక్రియ జరుగుతోందని, అన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరిస్తున్నామని తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో నాలుగు మిల్లులు మినహా మిగిలిన వారంతా బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చారని చెప్పారు. జనవరి 4 నాటికి 20 వేల మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ ఇవ్వాలని ఆదేశించినట్లు వెల్లడించారు. జిల్లాలో రూ.537.67 కోట్లతో చేపట్టిన వివిధ ప్రభుత్వ భవనాలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. రూ.248.78 కోట్లతో 664 గ్రామ సచివాలయ భవనాలు మంజూరు కాగా 472 భవనాల పనులు ప్రగతిలో ఉన్నాయని తెలిపారు. రూ.136.23 కోట్లతో 620 రైతు భరోసా కేంద్రాలు మంజూరు కాగా 462 భవనాల పనులు ప్రగతిలో ఉన్నాయని చెప్పారు. భోగాపురం ఎయిర్‌పోర్టు కోసం 2680.25 ఎకరాలు సేకరించామని తెలిపారు. అందులో ఏపీఏడీసీకి ఇప్పటివరకూ 2594.48 ఎకరాలు అప్పగించామని  ఇంకా 86.21 ఎకరాలే సేకరించాల్సి ఉందని చెప్పారు. 



Updated Date - 2021-12-31T04:29:18+05:30 IST