భీమసింగి షుగర్స్‌ తెరిపించేందుకు సంతకాల సేకరణ

ABN , First Publish Date - 2021-08-28T05:21:01+05:30 IST

భీమసింగి షుగర్స్‌ను తెరిపించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం సంతకాల సేకరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.

భీమసింగి షుగర్స్‌ తెరిపించేందుకు సంతకాల సేకరణ
నినాదాలు చేస్తున్న నాయకులు

శృంగవరపుకోట రూరల్‌‘(జామి): భీమసింగి షుగర్స్‌ను తెరిపించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం సంతకాల సేకరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈసందర్భంగా అఖిలపక్షం నేతలు భీశెట్టి బాబ్జీ, పి.కామేశ్వర రావు, బండారు పెదబాబు, త్యాడ రామకృష్ణ, చల్లా జగన్‌, బుగత అశోక్‌లు మాట్లాడుతూ ఫ్యాక్టరీ తెరవాలని కోరుతున్నా పాలకుల్లో స్పందన లేకపోవడం దారుణమన్నారు. భీమసింగి సుగర్స్‌పై తమ నిర్ణయం ఏమిటో మంత్రులు, ఎమ్మెల్యేలు స్పష్టత ఇవ్వాలని కోరారు. కార్మికులను ఆదుకోవాలని కర్మాగారం పర్సన్‌ఇన్‌చార్జి, జేసీ కిశోర్‌కుమార్‌ను కలిసి కనీసం కార్మికులకు రెండు నెలల జీతం ఇవ్వాలని కోరినా పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో సామాజిక కార్యకర్త గార పెంటయ్య, ఉంగరాల శ్రీను, రాందాసు, ఆదిబాబు తదితరులు పాల్గొన్నారు.

 

 

Updated Date - 2021-08-28T05:21:01+05:30 IST