డబ్బులు వసూలే ఓటీఎస్‌ లక్ష్యం కాదు : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-12-07T05:32:38+05:30 IST

డబ్బులు వసూలు చేయడమే ఓటీఎస్‌ (వన్‌టైం సెటిల్‌మెంట్‌) లక్ష్యం కాదని, లబ్ధిదారులకు శాశ్వత ప్రయోజనాలు కల్పించడమే ప్రధాన ఉద్దేశమని కలెక్టర్‌ సూర్యకుమారి తెలిపారు.

డబ్బులు వసూలే ఓటీఎస్‌ లక్ష్యం కాదు : కలెక్టర్‌

 కలెక్టరేట్‌ : డబ్బులు వసూలు చేయడమే ఓటీఎస్‌ (వన్‌టైం సెటిల్‌మెంట్‌)  లక్ష్యం కాదని, లబ్ధిదారులకు శాశ్వత ప్రయోజనాలు కల్పించడమే ప్రధాన ఉద్దేశమని కలెక్టర్‌ సూర్యకుమారి తెలిపారు.  ఓటీఎస్‌ అమలు తీరుపై జిల్లా ప్రత్యేక అధికారులు , ఎంపీడీవోలు, తహసీల్దార్లతో సోమవారం కలెక్టర్‌ ఆనలైన్‌ సమావేశం నిర్వహించారు.  ఈ పఽథకం పూర్తిగా స్వచ్ఛందమని , దీనిపై ఎలాంటి ఒత్తిడి ఉండదని చెప్పారు. లబ్ధిదా రులకు ఓటీఎస్‌ ప్రయోజనాలు, రిజిస్ర్టేషన్‌ ప్రక్రియపై పూర్తిగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.  స్థానిక   ప్రజాప్రతినిధుల సహకారంతో  పథకం లక్ష్యం నెరవేర్చాలని జేసీలు సూచించారు.  బుఽధవారం  మెగా క్యాం పెన్‌ నిర్వహించనున్నట్లు  చెప్పారు. జిల్లాలోని 1.7 లక్షలు మంది లబ్ధిదా రులు ఉండగా వారి నుంచి సుమారు రూ.7 కోట్లు వసూలైనట్లు వివరిం చారు. అందులో ఇప్పటివరకూ రూ. 4 కోట్లు మాత్రమే అకౌంట్‌లో డిపాజిట్‌ అయ్యిందని, మిగతా నగదు ఖాతాల్లో జమ చేయాలని కలెక్టర్‌ సూచించారు  జేసీలు  మహేష్‌ కుమార్‌, మయూర్‌ అశోక్‌,  వెంకటరావు, ఆర్‌డీవో భవానీ శంకర్‌, డీఆర్‌డీఏ పీడీ అశోక్‌ కుమార్‌, జిల్లా రిజిస్ర్టార్‌ సృజన ఉన్నారు.


Updated Date - 2021-12-07T05:32:38+05:30 IST