అశోక్‌కు చంద్రబాబు అభినందనలు
ABN , First Publish Date - 2021-02-01T05:33:48+05:30 IST
రాష్ట్రంలోని మూడు ప్రధాన దేవాలయాలకు అనువంశిక ధర్మకర్తగా అశోక్ గజపతిరాజునే కొనసాగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేస్తూ అశోక్‌కు అభినందనలు తెలిపారు.

విజయనగరం రూరల్, జనవరి 31 : రాష్ట్రంలోని మూడు ప్రధాన దేవాలయాలకు అనువంశిక ధర్మకర్తగా అశోక్ గజపతిరాజునే కొనసాగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేస్తూ అశోక్‌కు అభినందనలు తెలిపారు. ఆదివారం ఫోన్ చేసి కొద్దిసేపు మాట్లాడారు. ‘మీరు నమ్మిన నీతి, న్యాయం మీకు తోడుగా ఉన్నాయని’ కితాబిచ్చారు.