ఇసుక అక్రమ రవాణాపై కేసు

ABN , First Publish Date - 2021-11-29T05:18:30+05:30 IST

స్థానిక చంపావతి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 18 ఎడ్ల బళ్లను స్వాధీనం చేసుకొని, నిందితులపై కేసు నమోదు చేసినట్టు డెంకాడ ఎస్‌ఐ ఎన్‌.పద్మావతి తెలిపారు.

ఇసుక అక్రమ రవాణాపై కేసు

  18 ఎడ్ల బళ్లు స్వాధీనం

 డెంకాడ, నవంబరు 28: స్థానిక చంపావతి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 18 ఎడ్ల బళ్లను స్వాధీనం చేసుకొని, నిందితులపై కేసు నమోదు చేసినట్టు డెంకాడ ఎస్‌ఐ ఎన్‌.పద్మావతి తెలిపారు. చంపావతినదిలో గత కొంత కాలంగా వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటికి కారణమైన ఇసుక అక్రమ రవాణాపై డెంకాడ ప్రజలు స్పందించారు. ఆదివారం వేకువజామున చం పావతి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఎడ్ల బళ్లను గుర్తించి, వీఆర్వో రామారావుకు తెలియజేశారు. వారి సహకారంతో పోతియ్యపాలెం గ్రామా నికి చెందిన 18 ఎడ్ల బళ్లను పట్టుకొని, నిందితులపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. డెంకాడ, పరిసర ప్రాంతాల చంపావతి నదీ పరివాహక ప్రాంతాల నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నవారిని పట్టుకోవడానికి పోలీసు గస్తీని ఏర్పాటు చేశామని చెప్పారు. రెవెన్యూ అధికారులు, స్థానికులు సహాయ సహకా రాలు అందించాలని ఆమె కోరారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నవారిపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. 

Updated Date - 2021-11-29T05:18:30+05:30 IST