పశు సంరక్షణపై శ్రద్ధ కనబరచాలి

ABN , First Publish Date - 2021-03-23T05:28:40+05:30 IST

పశు సంరక్షణపై రైతులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని జిల్లా పశుసంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రెడ్డి కృష్ణ అన్నారు.

పశు సంరక్షణపై శ్రద్ధ కనబరచాలి

నెల్లిమర్ల, మార్చి 22: పశు సంరక్షణపై రైతులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని జిల్లా పశుసంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రెడ్డి కృష్ణ అన్నారు. అలుగోలులో ఏర్పాటుచేసిన పశువైద్య శిబిరాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ శిబిరంలో సుమారు 25 పశువులకు వైద్యం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ శాఖ ఏడీ డాక్టర్‌ జి.చక్రవర్తి, డాక్టర్‌ సుబ్రహ్మణ్యం, మండల పశువైద్యాధికారి డాక్టర్‌ శశిభూషణరావు, సతివాడ పశువైద్యకేంద్రం వైద్యుడు చంద్రశేఖర్‌, వైసీపీ నాయకుడు సారికి వైకుంఠంనాయుడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సతివాడలో జరిగిన కార్యక్రమంలో సచివాలయాల్లో పనిచేస్తున్న పశు వైద్య సహాయకులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. 

 

Updated Date - 2021-03-23T05:28:40+05:30 IST