కార్ల అపహరణ?

ABN , First Publish Date - 2021-05-31T05:17:03+05:30 IST

: వ్యాపారం కోసం కారు అవసరమని అద్దెకు తీసుకుని అనంతరం తనఖా పెట్టి పరారవుతున్న ఓ ఘనుడి ఘనకార్యం పార్వతీపురంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పలువురు కారు యజమానుల నుంచి ఆ వ్యక్తి అద్దె ప్రాతిపదికన దాదాపు 40 కార్లు తీసుకున్నట్లు సమాచారం

కార్ల అపహరణ?

అద్దె పేరుతో తీసుకుని తనఖా

పోలీసుల అదుపులో నిందితుడు...? 

పార్వతీపురం, మే 30: వ్యాపారం కోసం కారు అవసరమని అద్దెకు తీసుకుని అనంతరం తనఖా పెట్టి పరారవుతున్న ఓ ఘనుడి ఘనకార్యం పార్వతీపురంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పలువురు కారు యజమానుల నుంచి ఆ వ్యక్తి అద్దె ప్రాతిపదికన దాదాపు 40 కార్లు తీసుకున్నట్లు సమాచారం. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

పార్వతీపురానికి చెందిన ఓ వ్యక్తి వాహన యజమానులకు నెలకు రూ.30వేలు అద్దె చెల్లిస్తానని ఒప్పందం కుదుర్చుకుంటూ కార్లు తీసుకుంటున్నాడు. కొన్ని నెలలుగా వాహన యజమానులకు అద్దె చెల్లించకపోవడంతో వారికి అనుమానం పెరిగింది. పార్వతీపురం చేరుకొని కొద్దిరోజులుగా తమ వాహనాల కోసం అన్వేషణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఆ వ్యక్తిగురించి కొంత సమాచారం తెలుసుకున్నారు. అద్దెకు తీసుకున్న ఒక్కో కారును రూ.3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు తనఖా పెట్టినట్లు నిర్ధారణకు వచ్చారు. తమ కార్లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకొని.. తనఖాకు తీసుకున్న వారి వివరాలను సేకరించారు. వాటి ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. వాహనాలను అద్దెకు తీసుకున్న వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కార్ల తనఖా విషయాన్ని సీఐ లక్ష్మణరావు వద్ద ఆదివారం ప్రస్తావించగా ఫిర్యాదులు వచ్చిన మాట వాస్తవమేనని, విచారణ చేపడుతున్నట్లు చెప్పారు. 


Updated Date - 2021-05-31T05:17:03+05:30 IST