మెంటాడలో గంజాయి స్వాధీనం
ABN , First Publish Date - 2021-11-28T05:48:22+05:30 IST
మెంటాడ మండలంలో నాలుగోసారి గంజాయి పట్టుబడటం కలకలం రేగింది. పిట్టాడ చెక్‌పో స్ట్ వద్ద అటుగా వస్తు న్న ఆటోను ఆండ్ర పోలీసులు తనిఖీ చేయగా 66 కేజీలు గంజాయి పట్టుబడింది.

మెంటాడ: మెంటాడ మండలంలో నాలుగోసారి గంజాయి పట్టుబడటం కలకలం రేగింది. పిట్టాడ చెక్‌పో స్ట్ వద్ద అటుగా వస్తు న్న ఆటోను ఆండ్ర పోలీసులు తనిఖీ చేయగా 66 కేజీలు గంజాయి పట్టుబడింది. అయితే నిందితులు పరారు కావడానికి ప్రత్నించారు. దీంతో ఎస్‌ఐ సుదర్శన్ వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశారు. సంఘటనా స్థలం నుంచి సుమా రు 3 కిలోమీటర్ల దూరంలో పొలాల గుండా పారిపోతుండగా, పోలీసులు వెంబడించి, ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. గంజాయిని పాడేరు నుంచి విజయనగరం తరలిస్తున్నారని ఎస్‌ఐ సుదర్శన్ తెలిపారు. 66 కేజీలు గంజాయి విలువ సుమారు రూ.2లక్షలు ఉంటుందని చెప్పారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని, ఆటోను సీజ్ చేశామని తెలిపారు.