సీపీఎస్‌ రద్దు ప్రకటించాలి

ABN , First Publish Date - 2021-01-13T05:44:00+05:30 IST

కొత్త సంవత్సరంలో ఉపాధ్యాయ, ఉద్యోగులకు కానుకగా సీపీఎస్‌ రద్దుని ప్రకటించాలని మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం కంటోన్మెంట్‌లోని మునిసిపల్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్వీసు రూల్స్‌ అమల్లో న్యాయపరమైన ఇబ్బందులు తొలగించి పదోన్నతులకు అవకాశం కల్పించాలని అన్నారు.

సీపీఎస్‌ రద్దు ప్రకటించాలి
మాట్లాడుతున్నమాజీ ఎమ్మెల్సీ గాదె

మాజీ ఎమ్మెల్సీ గాదె

విజయనగరం దాసన్నపేట : కొత్త సంవత్సరంలో ఉపాధ్యాయ, ఉద్యోగులకు కానుకగా సీపీఎస్‌ రద్దుని ప్రకటించాలని మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం కంటోన్మెంట్‌లోని మునిసిపల్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ  సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్వీసు రూల్స్‌ అమల్లో న్యాయపరమైన ఇబ్బందులు తొలగించి పదోన్నతులకు అవకాశం కల్పించాలని అన్నారు. ఉపాధ్యాయుల పెండింగ్‌ సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని, పీఆర్‌సీ, డీఏలు ప్రకటించాలన్నారు. కరోనా నివారణలో అశ్రద్ధ చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని పాఠశాలలను ప్రారంభించాలని కోరారు. అమ్మఒడి రెండో విడత కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పీఆర్‌టీయూ పక్షాన ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్టు చెప్పారు.  కార్యక్రమంలో పీఆర్‌టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆల్తి రాంబాబు, తవిటినాయుడు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-13T05:44:00+05:30 IST