ఒడిశా దూకుడును అడ్డుకోలేరా?

ABN , First Publish Date - 2021-02-07T05:17:02+05:30 IST

ఆంధ్ర-ఒడిశా వివాదస్పద గ్రామాల్లో ఒడిశా దూకుడుకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోలేకపోవడం ఎంతవరకు సమంజసమని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ ప్రశ్నించారు.

ఒడిశా దూకుడును అడ్డుకోలేరా?

 దాసన్నపేట, ఫిబ్రవరి 6: ఆంధ్ర-ఒడిశా వివాదస్పద గ్రామాల్లో ఒడిశా దూకుడుకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోలేకపోవడం ఎంతవరకు సమంజసమని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ ప్రశ్నించారు. అక్కడి అధికారులు అనుమతులు లేకుండా చొచ్చుకొ చ్చి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమ న్నారు. శనివారం ఆర్‌అండ్‌బీ సమీపంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో  ఆయన మాట్లాడుతూ.. సాలూరు మండలం కొఠియా గ్రూప్‌లో 21 గ్రామాలు ఉన్నాయన్నారు. వాటిలో గంజాయిభద్ర, పగులచెన్నూరుతో పాటు సారిక, కురుకూటి పంచాయతీ పరిధిలో కొన్ని గ్రామాల్లో దశా బ్దాలకు పైగా సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నాయన్నారు.   ప్రస్తు తం ఒడిశా సర్కార్‌,  రాష్ట్ర ప్రభుత్వంతో కనీసం చర్చలు జరపకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంద న్నారు. గత నాలుగు నెలలుగా సరిహద్దు ప్రాంతాల్లో చొరబడి  అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోం దని చెప్పారు. ప్రస్తుతం ఎన్నికల ఉండగా, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ వర్చువల్‌ ద్వారా శుక్ర వారం మీట నొక్కి కొఠియాలో రూ.150 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే, విలువైన సంపద కొల్పోయే అవకాశం ఉంద ని తెలిపారు.  దీనిపై సీఎం జగన్‌కు లేఖకు పంపించినట్లు చెప్పారు.  

 

Updated Date - 2021-02-07T05:17:02+05:30 IST