నేటి నుంచి కరోనాపై ప్రచారం
ABN , First Publish Date - 2021-03-24T05:48:48+05:30 IST
కరోనా రెండో దశ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు సచివాలయ కార్యదర్శులు చురుగ్గా వ్యవహరించాలని నగర పంచాయతీ కమిషనర్ జె.రామఅప్పలనాయుడు సూచించారు.

నెల్లిమర్ల, మార్చి 23: కరోనా రెండో దశ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు సచివాలయ కార్యదర్శులు చురుగ్గా వ్యవహరించాలని నగర పంచాయతీ కమిషనర్ జె.రామఅప్పలనాయుడు సూచించారు. నెల్లిమర్ల నగర పంచాయతీలోని 8 వార్డుల్లో పనిచేస్తున్న పరిపాలన కార్యదర్శులు, శానిటేషన్ కార్యదర్శులు, మహిళా కార్యదర్శులతో ఆయన మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 24వ తేదీ నుంచి 15 రోజుల పాటు ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్టు చెప్పారు. ప్రతిఒక్కరూ మాస్క్‌లు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ త్రినాధనాయుడు, శానిటరీ ఇనస్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.