రక్త సంబంధం విలువైనది

ABN , First Publish Date - 2021-11-10T04:52:16+05:30 IST

చిన్న చిన్న విషయాలకు గొడవలు పడి ప్రశాంతతను కోల్పోవద్దని.. ఆస్తుల కన్నా రక్త సంబంధం గొప్పదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ్‌ చక్రవర్తి హితవు పలికారు. వాటి విషయంలో ఎవరూ తప్పిదాలు చేయవద్దని సూచించారు. న్యాయ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకుని రామవరం గ్రామంలో మంగళవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.

రక్త సంబంధం విలువైనది

న్యాయ అవగాహన సదస్సులో జిల్లా జడ్జి సాయి కళ్యాణ్‌చక్రవర్తి 

గంట్యాడ, నవంబరు 9: చిన్న చిన్న విషయాలకు గొడవలు పడి ప్రశాంతతను కోల్పోవద్దని.. ఆస్తుల కన్నా రక్త సంబంధం గొప్పదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ్‌ చక్రవర్తి హితవు పలికారు. వాటి విషయంలో ఎవరూ తప్పిదాలు చేయవద్దని   సూచించారు. న్యాయ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకుని రామవరం గ్రామంలో మంగళవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్తి తగదాలు, ఇతర గొడవలతో జీవితాలను చిన్నాభిన్నం చేసుకోవద్దని, అందరూ ప్రశాంతంగా జీవించాలని చెప్పారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ లక్ష్యాలను చేరుకోవడంలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయ సేవాధికార సంస్థ తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి, సీనియర్‌ జడ్జి వి.లక్ష్మీరాజ్యం, బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ హరగోపాల్‌, కార్యదర్శి ఏవీఎన్‌ అంజనీకుమార్‌, ఎంపీపీ హైమావతి, సర్పంచ్‌ పద్మావతి, తహసీల్దార్‌ ప్రసన్న రాఘవ, విజయనగరం రూరల్‌ సీఐ మంగవేణి, గంట్యాడ ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-10T04:52:16+05:30 IST