చెత్తకుప్పల్లో బాలామృతం

ABN , First Publish Date - 2021-10-30T04:11:39+05:30 IST

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకంలో భాగంగా బాలామృతం పేరిట అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే పాల ప్యాకెట్లు ఇవి. బొబ్బిలి పట్టణంలో చెత్తకుప్పలు, తుప్పల మధ్య శుక్రవారం కనిపించడం చర్చనీయాంశమైంది.

చెత్తకుప్పల్లో బాలామృతం
చెత్తకుప్పల్లో బాలామృతం పాలప్యాకెట్లు




బొబ్బిలి రూరల్‌: వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకంలో భాగంగా బాలామృతం పేరిట అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే పాల ప్యాకెట్లు ఇవి. బొబ్బిలి పట్టణంలో చెత్తకుప్పలు, తుప్పల మధ్య శుక్రవారం కనిపించడం చర్చనీయాంశమైంది. వాటిపై తయారీ తేదీ, వినియోగం గడువు వంటివి ఏవీ కనిపించకపోవడం విశేషం. ఇటీవల పౌష్టికాహారం పంపిణీపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ... ఇలా పదుల సంఖ్యలో పాల ప్యాకెట్లను బయట పారబోయడంపై రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఐసీడీఎస్‌ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పట్టణ ఐసీడీఎస్‌ అధికారి విజయకుమారి వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా బాలామృతం ప్యాకెట్ల పంపిణీ సక్రమంగానే జరుగుతుందని చెప్పారు. లబ్ధిదారులే బయట పడేసి ఉంటారని అభిప్రాయపడ్డారు.



Updated Date - 2021-10-30T04:11:39+05:30 IST