ఆటో బోల్తా.. మహిళ మృతి

ABN , First Publish Date - 2021-11-01T05:21:51+05:30 IST

ఆటో బోల్తా పడి ఓ మహిళ మృతిచెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యా యి. ఈ సంఘటన మండలంలోని కలవచర్ల రోడ్డులో ఆదివారం చోటు చేసుకుంది.

ఆటో బోల్తా.. మహిళ మృతి

  ఒకరికి తీవ్ర గాయాలు 

గుర్ల: ఆటో బోల్తా పడి ఓ మహిళ మృతిచెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యా యి. ఈ సంఘటన మండలంలోని కలవచర్ల రోడ్డులో ఆదివారం చోటు చేసుకుంది. వివరా లిలా ఉన్నాయి. గరికివలసకు చెంది న కేసలి ఆదినారాయణ తన ఆటోపై నారాయణ, అప్పలనారా యణ, గుమ్మడి అప్పయ్యమ్మ(65)లను తన స్వగ్రామం నుంచి గుర్ల తీసుకువె ళ్తున్నారు. కలవచర్ల రోడ్డుకు వచ్చేసరికి, ఎదురుగా కోటగం డ్రేడు గ్రామానికి చెందిన ముద్దాడ రాము ద్విచక్రవాహనంపై వస్తున్నారు. ఈ ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఆటో బోల్తా పడింది. అలాగే ఆటోను తప్పించే క్రమంలో ద్విచక్ర వాహనం ఆటోపైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న గరికివలసకు చెందిన అప్పయ్యమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. ద్విచక్ర వాహ నదారుడు రాముకు తీవ్రమైన గాయాలయ్యాయి. క్షతగా త్రుడిని 108 వాహనం ద్వారా విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పయ్యమ్మ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీపురుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్‌ తో పాటు మిగతా ప్రయాణికుల కు ఎటువంటి గాయాలు కాలేదు. సమాచారం తెలుసుకున్న గుర్ల ఎస్‌ఐ జి.శిరీష ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమో దు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఆమె తెలిపారు.   

 

Updated Date - 2021-11-01T05:21:51+05:30 IST