ఆటో, బైకు ఢీ.. ఒకరికి గాయాలు
ABN , First Publish Date - 2021-05-14T04:47:24+05:30 IST
ఆటో, బైకు ఢీకొన్న ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బొబ్బిలి మండలంలోని గొల్లపల్లి రోడ్డుపై గురువారం చోటుచేసుకుంది.

సీతానగరం(బొబ్బిలి), మే 13: ఆటో, బైకు ఢీకొన్న ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బొబ్బిలి మండలంలోని గొల్లపల్లి రోడ్డుపై గురువారం చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. అలజంగి గ్రామానికి చెందిన పెంకి అప్పలనాయుడు(37) తన సొంత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై బొబ్బిలి బయల్దేరాడు. అయితే బొబ్బిలి నుంచి పిరిడి వస్తున్న ఆటో గొల్లపల్లి రోడ్డుపై ఈ బైకును ఢీకొంది. దీంతో బైకు బోల్తా పడగా అప్పలనాయుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే బొబ్బిలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిశీలించి, పరిస్థితి విషమంగా ఉంద ని, విజయనగరం ఆసుపత్రికి రిఫర్ చేశారు. దీనిపై పట్టణ ఎస్ఐ సత్యనా రాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.